జీలుగుమిల్లి గిరిజన పాఠశాలలో పోలీసుల ప్రత్యేక సదస్సు

గిరిజన సంక్షేమ పాఠశాలలో చిన్నారులు, మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం

జీలుగుమిల్లి మంజీర గళం ప్రతినిధి ఏప్రిల్ 18

ఆదివారం జీలుగుమిల్లి గిరిజన సంక్షేమ పాఠశాలలో చిన్నారుల రక్షణ, మహిళల భద్రత, మైనర్ బాలికల సంరక్షణ, అలాగే సైబర్ నేరాల నివారణపై అవగాహన కార్యక్రమం జీలుగుమిల్లి ఎస్ఐ క్రాంతి కుమార్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులకు బాల్య వివాహాల నివారణ, చిన్నారులపై జరుగుతున్న నేరాల నుండి రక్షణ, మహిళలపై వేధింపులు నివారించడం, అత్యవసర సమయంలో పోలీసులను ఎలా సంప్రదించాలి వంటి అంశాలపై వివరంగా తెలియజేశారు.
అలాగే ప్రస్తుత కాలంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, మొబైల్ ఫోన్ మరియు సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆన్‌లైన్ మోసాల నుండి ఎలా రక్షించుకోవాలి అనే విషయాలపై విద్యార్థులకు స్పష్టమైన అవగాహన కల్పించారు.

మైనర్ బాలికల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, అనుమానాస్పద పరిస్థితులు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొని పలు సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *