ఇరాన్ యుద్ధం మళ్లీ మొదలవుతుందా? ఇజ్రాయెల్ చర్యలతో పెరుగుతున్న టెన్షన్

 లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు: ఏపీ, తెలంగాణ, హైదరాబాద్ ప్రజలు టీవీల్లో చూసే ఆ భయంకర దృశ్యాలు మరచిపోలేరు. ఏప్రిల్ 8న ఇజ్రాయెల్ జస్ట్ 10 నిమిషాల్లోనే 100 ఆకాశ దాడులు చేసి లెబనాన్‌లో రక్తపాతం సృష్టించింది. ఈ దాడుల వల్ల ఏప్రిల్ 9 ఉదయం నాటికి లెబనాన్ సివిల్ డిఫెన్స్ ప్రకారం 254 మంది చనిపోయారు. అలాగే 1,165 మంది గాయపడ్డారు. బీరుట్ సెంట్రల్, బెక్కా వ్యాలీ, సౌత్ లెబనాన్ గ్రామాలు, మౌంట్ లెబనాన్.. అన్నీ ధ్వంసమయ్యాయి. ఇది మార్చి 2026 నుంచి కొనసాగుతున్న ఇజ్రాయెల్-హెజ్బొల్లా యుద్ధంలో అతి పెద్ద దాడి అని ఆల్ జజీరా, రాయిటర్స్ తెలిపాయి. (Image: Reuters)

మధ్యప్రాచ్యంలో సెగలు.. ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య మళ్లీ యుద్ధం మొదలవుతుందా?

అంతర్జాతీయ డెస్క్: ఇజ్రాయెల్ వరుస సైనిక చర్యలతో మధ్యప్రాచ్యంలో మరోసారి టెన్షన్ తారాస్థాయికి చేరింది. ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా, హమాస్ గ్రూపుల లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తున్న దాడులు.. ఇప్పుడు నేరుగా ఇరాన్‌ను రెచ్చగొట్టేలా మారుతున్నాయి. ఇరు దేశాల మధ్య మాటల యుద్ధం ముదిరి, అది ఏ క్షణమైనా పూర్తిస్థాయి యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది.

 దాడుల వివరాలు & సాధారణ ప్రజలపై ప్రభావం: ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ 50 ఫైటర్ జెట్లతో 100 హెజ్బొల్లా కమాండ్ సెంటర్లు, మిలిటరీ సైట్లను టార్గెట్ చేసినట్లు ఇజ్రాయెల్ చెప్పింది. కానీ దాడులు రెసిడెన్షియల్ ఏరియాలు, షాపింగ్ ఏరియాల్లోకి కూడా విస్తరించాయి. బీరుట్‌లో భారీ పొగలు, అగ్నిప్రమాదాలు కనిపించాయి. ఆసుపత్రులు నిండిపోయాయి. లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకారం ఒక్క రోజులోనే 112 మంది మరణించినట్లు మొదటి రిపోర్టులు వచ్చాయి. సాధారణ ప్రజలైన పిల్లలు, మహిళలు, వృద్ధులు ఇళ్లలోనే చిక్కుకున్నారు. 12 లక్షల మంది ఇప్పటికే వలస వెళ్లిపోయి బాధపడుతున్నారు. ఈ దాడులు ఆహారం, మందులు సరఫరాని కూడా నిలిపేశాయని రాయిటర్స్ తెలిపింది. (Image: Google Earth)

యుద్ధం ముదరడానికి ప్రధాన కారణాలు:

  • ప్రాక్సీ యుద్ధం నుంచి నేరుగా దాడుల వరకు: గతంలో ఇరాన్ తన మద్దతుదారుల (హిజ్బుల్లా, హమాస్, హౌతీలు) ద్వారా ఇజ్రాయెల్‌పై దాడులు చేయించేది. అయితే, ఇప్పుడు ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ గడ్డపై లేదా ఇరాన్ అధికారులపై దాడులు చేస్తుండటంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహంతో ఉంది.
  • ముఖ్య నేతల హత్యలు: ఇరాన్ సైనిక కమాండర్లు మరియు హమాస్ వంటి మిత్రపక్షాల అగ్రనేతల మరణాలకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ పదేపదే హెచ్చరిస్తోంది.
  • ఇజ్రాయెల్ వైఖరి: తమ దేశ భద్రత కోసం ఎంతటి కఠిన నిర్ణయానికైనా వెనకాడబోమని, ఇరాన్ అణు సామర్థ్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ వ్యూహాలు రచిస్తోంది.
 ఇజ్రాయెల్ ఇలా ఎందుకు చేస్తోంది?: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఓ మాట చెప్పారు. “అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ అనేది లెబనాన్‌ను కవర్ చేయదు” అని చెప్పారు. ఇరాన్ మద్దతుతో హెజ్బొల్లా.. ఉత్తర ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడులు చేస్తోంది కాబట్టి.. సరిహద్దు సేఫ్టీ కోసం తాను ఈ దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ వాదిస్తోంది. మార్చి నుంచి హెజ్బొల్లా, ఇజ్రాయెల్‌పై దాడులు పెంచడంతో, ఇజ్రాయెల్ కూడా లెబనాన్‌ దక్షిణ ప్రాంతంలో సెక్యూరిటీ జోన్ ఏర్పాటు చేసి, హెజ్బొల్లా ఆయుధాల్ని నాశనం చేస్తోంది. ఇది డిఫెన్సివ్ చర్య అని ఇజ్రాయెల్ చెబుతోంది. (Image: Reuters)

యుద్ధం వస్తే ప్రభావం ఎలా ఉంటుంది?

  1. ముడి చమురు ధరలు: ఇరాన్ యుద్ధంలోకి దిగితే ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా దెబ్బతింటుంది. దీనివల్ల పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకవచ్చు.
  2. ఆర్థిక సంక్షోభం: ఇప్పటికే ఉక్రెయిన్ యుద్ధంతో సతమతమవుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇది కోలుకోలేని దెబ్బ అవుతుంది.
  3. అగ్రరాజ్యాల జోక్యం: ఒకవేళ యుద్ధం మొదలైతే అమెరికా ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలుస్తుంది, అదే సమయంలో రష్యా, చైనాల వైఖరి ఏంటనేది ఉత్కంఠగా మారింది
 అమెరికా వాదన ఏంటి?: అమెరికా కూడా ఇజ్రాయెల్‌కి అనుకూలంగా మాట్లాడుతోంది. ఏప్రిల్ 7న ఇరాన్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అనేది.. రెండు దేశాల మధ్య డీల్ మాత్రమే అని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ అన్నారు. “లెబనాన్ ఈ కాల్పుల విరమణలో భాగం కాదు” అని అన్నారు. ఐతే.. ఇజ్రాయెల్ పెట్టిన 10 కండీషన్లలో.. తమ మద్దదు దారులపై కూడా దాడులు ఆపాలని కోరింది. ఆ మద్దతుదారుల్లో హమాస్, హెజ్బొల్లా, హౌతీలు, మిలీషియాలు ఉన్నారు. వీరిలో హెజ్బొల్లా మిలిటెంట్లు.. ఇరాన్ సరిహద్దున ఉన్న లెబనాన్ దక్షిణ ప్రాంతంలో ఉంటారు. వీరు తరచూ ఇజ్రాయెల్‌ని టార్గెట్ చేస్తున్నారు. అందుకే ఇజ్రాయెల్.. ఆపరేషన్ ఎటర్నల్ డార్క్‌నెస్ అనే పేరు పెట్టి హెజ్బొల్లా కంట్రోల్ సెంటర్లను టార్గెట్ చేసిందని ఆల్ జజీరా తెలిపింది. (Image: Reuters)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *