చనిపోతానంటూ భర్తను బెదిరించిన భార్య.. తర్వాత ఏం జరిగిందో తెలిసి అంతా షాక్

భార్యాభర్తల మధ్య గొడవలు హత్యలకు, ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. అనుమానం, ఆధిపత్య ధోరణి, ఆర్ధిక సమస్యలు ఇలా ఏదో విషయంలో ఇద్దరి మధ్య ఉన్న గొడవలకు అభం శుభం తెలియని వాళ్ల పిల్లలు బలైపోతున్న పరిస్థితులు అధికమవుతున్నాయి. తాను బ్రతకనప్పుడు తన పిల్లలు కూడా ఉండకూడదనే ఆలోచనతో కొందరు పిల్లల్ని బలవంతంగా ప్రాణాలు తీస్తున్న సందర్భాలు ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు సమీపంలోని బుట్టాయిగూడెం మండలం అంతర్వేది గూడెంలో భర్తను బెదిరిద్దామని భార్య తెచ్చుకున్న పురుగుల మందు వాళ్ల బిడ్డ తాగడంతో ప్రాణాలు కోల్పోవడం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది.

భర్తను బెదిరించాలని చూసిన భార్య..

ఆలుమగలు అంటే అన్ని విషయాల్లో సమానమని అర్ధం. అంతే కాదు ఏదైనా సమస్య, ఇబ్బందులు వస్తే దాన్ని పరిష్కరించుకోవడంలో ఇద్దరూ కలిసి పంచుకోవాలన్నదే మన హిందూ ధర్మ ఆచారం. అయితే ఆంధ్రప్రదేశ్ ఏలూరు సమీపంలోని బుట్టాయిగూడెం మండలం అంతర్వేది గూడెం ప్రాంతంలో ఓ అమానుష సంఘటన జరిగింది. గ్రామానికి చెందిన ఓ దంపతుల మధ్య వచ్చిన విభేదాల నేపథ్యంలో ఓ వివాహిత భర్తను బెదిరించడానికి ఇంటికి పురుగుల మందును కూల్ డ్రింక్ డబ్బాలో పోసుకొని తీసుకొచ్చింది. భార్య భర్తను పురుగుల మందు తాగుతానని బెదిరించడంతో భర్త సర్ది చెప్పాడు. దీంతో విషయం అప్పటికి సద్దుమణిగింది. అయితే ఆ తర్వాత ఇలా జరుగుతుందని వాళ్లు గ్రహించలేకపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *