
వట్టుగుడిపాడు నూతన రజక సంఘం ఏకగ్రీవ ఎన్నిక
ఆగిరిపల్లి, మంజీర గళం ప్రతినిధి :
ఆగిరిపల్లి: మండల పరిధిలోని వట్టుగుడిపాడు గ్రామంలో ఆదివారం రజక సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూజివీడు నియోజకవర్గ సంఘ అధ్యక్షులు మానురాజు సురేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు పగడాల సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంఘ నూతన అధ్యక్షులుగా చిటికల సుబ్బారావు, ఉపాధ్యక్షులుగా బాల వెంకట సుమంత్, కొప్పాక సాంబశివరావు, సెక్రటరీగా గోగుంట మాధవరావు, మరియు ట్రెజరర్‌గా గణపవరపు వేణులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు.
కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ.. రజక సంఘం సభ్యులంతా ఐక్యంగా ఉంటూ కుల బాంధవుల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు గ్రామస్థులు,సంఘ ప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు.





