ద్వారకాతిరుమల ఆలయ ట్రస్ట్ బోర్డ్ మెంబెర్ గా గడ్డ మణుగు రవికుమార్.

జీలుగుమిల్లి మంజీర గళం ప్రతినిధి ఏప్రిల్ 18

తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని నూతనంగా ఎంపికైన ఆలయ కమిటీ మెంబర్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి, మాజీ జెడ్పిటిసి గడ్డ మణుగు రవికుమార్ ఆదివారం జీలుగుమిల్లిలో ఒక ప్రకటనలో తెలిపారు. జనసేన పార్టీ బలోపేతానికి అహిర్నిశలు కృషి చేసినందుకు గాను అధిష్టానం గుర్తించి ఈ పదవి దక్కబెట్టిందని తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తోపాటు పోలవరం నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో జనసేన పార్టీ గుర్తింపుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలలో కూడా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడినట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాలలో జనసేన పార్టీ ఆవిర్భావ నుండి తన వంతు పార్టీ కోసం పనిచేసినట్లు తెలిపారు. అందుకు ప్రతిఫలంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఏలూరు జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజు, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్ రాజు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కోటికలపూడి చినబాబు, డిసిసిబి మాజీ చైర్మన్ కరాటం రాంబాబు, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కరాటం సాయి లకు అభినందనలు తెలిపారు. అదేవిధంగా నియోజకవర్గంలోనే ఉన్న నాయకులకు కార్యకర్తలకు నాకు సహకరించినందుకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ తరఫున ఏ పదవి ఇచ్చిన గానే దానికి తగినంత న్యాయం చేస్తానని ఆయన అన్నారు. నియోజకవర్గంలోని జనసేన పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *