భారీ హైప్‌తో రిలీజైన వన్‌ప్లస్ నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్ ఫస్ట్ సేల్ ప్రారంభమైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మెయిన్ హైలైట్ 9,000mAh బ్యాటరీ ఉండటమే. ఇదే కాదు, మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. వన్‌ప్లస్ నార్డ్ 5తో పోలిస్తే ఎన్నో అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ర్యామ్, స్టోరేజ్, బ్యాటరీ, కెమెరా… ఇలా అన్ని ఫీచర్స్‌లో మంచి అప్‌గ్రేడ్స్ చూడొచ్చు. MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ స్టాండర్డ్ ఉండటం విశేషం. ఫస్ట్ సేల్‌లో అదిరిపోయే ఆఫర్స్ కూడా ప్రకటించింది వన్‌ప్లస్ ఇండియా. (image: OnePlus India)

వన్‌ప్లస్ నార్డ్ 6 ధరలు చూస్తే 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.38,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,999. ఫ్రెష్ మింట్, పిచ్ బ్లాక్, క్విక్ సిల్వర్ కలర్స్‌లో కొనొచ్చు. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.2,000 డిస్కౌంట్ లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ చేస్తే రూ.3,000 తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్స్‌తో బేస్ వేరియంట్‌ను రూ.35,999 ధరకు, హైఎండ్ వేరియంట్‌ను రూ.38,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. (image: OnePlus India)
9,000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉంది..80వాట్ సూపర్‌వూక్ ఛార్జింగ్, 27వాట్ వైర్డ్ రివర్స్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ బరువు 217 గ్రాములు.
వన్‌ప్లస్ నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 165Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78 అంగుళాల అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. క్రిస్టల్ గార్డ్ ప్రొటెక్షన్ ఉంది. డిస్‌ప్లేలో సన్‌బర్స్‌ట్ డిస్ప్లే, ఐ కంఫర్ట్, బెడ్ టైమ్ మోడ్, స్క్రీన్ కలర్ మోడ్, కలర్ పర్సనలైజేషన్, కలర్ విజన్ ఎన్‌హాన్స్‌మెంట్, ఆటో/మాన్యువల్ బ్రైట్‌నెస్, వైట్ పాయింట్ రిడక్షన్, స్క్రీన్ కలర్ టెంపరేచర్, నైట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 4 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 12జీబీ వరకు ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్ సపోర్ట్ ఉంది. ఆండ్రాయిడ్ 16 + ఆక్సిజన్ఓఎస్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. నాలుగేళ్లు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్, ఆరేళ్లు సెక్యూరిటీ ప్యాచెస్ లభిస్తాయి.
వన్‌ప్లస్ నార్డ్ 6 కెమెరా ఫీచర్స్ చూస్తే ఇందులో డ్యూయెల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50మెగాపిక్సెల్ Sony LYT-600 CMOS మెయిన్ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ ఓమ్నీవిజన్ OV08F అల్ట్రావైడ్ కెమెరాలు ఉన్నాయి. రియర్ కెమెరాలో ఫోటో, వీడియో, పోర్ట్రెయిట్, నైట్‌స్కేప్, ప్రో మోడ్, పనోరమా, సినిమాటిక్, స్లో-మో, లాంగ్ ఎక్స్‌పోజర్, డ్యూయల్-వ్యూ వీడియో, టైమ్-లాప్స్, టెక్స్ట్ స్కానర్, హైపర్‌టెక్స్ట్, హై-రెస్ మోడ్, టిల్ట్-షిఫ్ట్, గూగుల్ లెన్స్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.

వన్‌ప్లస్ నార్డ్ 6 మొబైల్‌లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో ఫోటో, వీడియో, పోర్ట్రెయిట్, నైట్‌స్కేప్, పనోరమా, డ్యూయల్-వ్యూ వీడియో, టైమ్-లాప్స్, రీటచ్, స్క్రీన్ ఫ్లాష్ ఫీచర్స్ ఉన్నాయి. ఇక వన్‌ప్లస్ నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్‌లో మెయిన్ హైలైట్ బ్యాటరీ. ఇందులో 9,000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ ఉంది. 80వాట్ సూపర్‌వూక్ ఛార్జింగ్, 27వాట్ వైర్డ్ రివర్స్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ బరువు 217 గ్రాములు



కనెక్టివిటీ విషయానికి వస్తే వన్‌ప్లస్ నార్డ్ 6 స్మార్ట్‌ఫోన్‌లో బ్లూటూత్ 6, 5జీ, జీపీఎస్, నావిక్, వైఫై, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఇ-కంపాస్, సిక్స్-యాక్సిస్ గైరోస్కోప్, కలర్ టెంపరేచర్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, X-యాక్సిస్ లీనియర్ మోటార్ సెన్సార్స్ ఉన్నాయి. ఓరియాల్టీ ఆడియో సపోర్ట్‌తో డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP66, IP68, IP69, IP69K రేటింగ్స్ ఉన్నాయి..




